తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు అండ్ కో వద్ద 200 కేజీల బంగారం, రూ.100 కోట్లు
అయ్యారే... ఐటీ శాఖ దూకుడు పెంచేసింది. ఎప్పుడు ఎవరి ఇంటి తలుపు తడతారో తెలియని స్థితి నెలకొంది. ముఖ్యంగా తమిళనాడులోని బడా బాబులు రూ.2000 కొత్త కరెన్సీ వారిని పీకల్లోతు కష్టాల్లో పడేసినట్లు అర్థమవుతుంది. నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చుకునేందుకు అడ్డదా
అయ్యారే... ఐటీ శాఖ దూకుడు పెంచేసింది. ఎప్పుడు ఎవరి ఇంటి తలుపు తడతారో తెలియని స్థితి నెలకొంది. ముఖ్యంగా తమిళనాడులోని బడా బాబులు రూ.2000 కొత్త కరెన్సీ వారిని పీకల్లోతు కష్టాల్లో పడేసినట్లు అర్థమవుతుంది. నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చుకునేందుకు అడ్డదారుల ద్వారా శేఖర్ రెడ్డి పొందిన సంగతి తెలిసిందే.
శేఖర్ రెడ్డి వద్ద వున్న కీలక సమాచారం ద్వారా తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఇళ్లలో బుధవారం నాడు ఐటీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం లభించినట్లు తెలుస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రామ్మోహన్ రావు ఇలా అక్రమ సంపాదన పోగేసినట్లు ఐటీ శాఖ భావిస్తోంది.
కాగా రామ్మోహన్ రావుని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఆయన ఇళ్లతోపాటు బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేసిన ఐటీ శాఖకు సుమారు రూ.100 కోట్ల నగదు, 200 కిలోల బంగారం పట్టుబడినట్లు తెలుస్తోంది.