శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 జులై 2021 (14:29 IST)

ఆన్‌లైన్ గేమ్ వ్యసనం : మమ్మీ సారీ అంటూ ఆరో తరగతి విద్యార్థిని సూసైడ్

ఆన్‌గైమ్ వ్యసనానికి లోనైన ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ చిన్నారి ఆరో తరగతి చదువుతున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు మమ్మీ సారీ అంటూ ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చాత్తర్ పూర్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాకు చెందిన 13 ఏళ్ళ కుర్రాడు ఆన్‌లైన్ గేమ్‌లో 40 వేల రూపాయలు నష్టపోయి తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరో తరగతి చదువుతున్న ఈ బాలుడు పాథాలజీ ల్యాబ్ యజమాని కొడుకని తెలిసింది. 
 
ఎంతసేపూ ఫోన్ పట్టుకుని ఈ గేమ్ ఆడుతున్నావని, చదువుకోవాలని ఇతని తల్లి మందలించినట్టు తెలుస్తోంది. తల్లి మందలింపుతో బాటు తాను రూ.40 వేలు నష్టపోవడంతో ఆ మానసిక వేదన భరించలేక ఈ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. 
 
తన తల్లికి చెందిన యూపీఐ అకౌంటు నుంచి ఈ కుర్రాడు ఈ డబ్బు విత్ డ్రా చేసి ‘ఫ్రీ ఫైర్ గేమ్’ అనే ఆన్‌లైన్ ఆట ఆడి నష్టపోయాడు. తనను క్షమించాలని, ఈ గేమ్‌లో ఈ డబ్బు లాస్ అయ్యాయని యితడు తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
 
ఈ బాలుడు తల్లి ఆరోగ్య శాఖలో పని చేసేదని, తల్లీ తండ్రీ ఇద్దరూ ఇంట్లో లేని సమయంలో ఈ అఘాయిత్యానికి దిగాడని పోలీసులు తెలిపారు. గత జనవరిలో కూడా ఇదే రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో 12 ఏళ్ళ బాలుడు ఈ ఆన్ లైన్ గేమ్‌కి బానిస కావడంతో తండ్రి మందలించి ఫోన్ లాక్కున్నాడని, దాంతో తన ప్రాణం తీసుకున్నాడు.