ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (15:06 IST)

కొన్ని ప్రాంతాల్లో కరోనా స్టేజ్ -3 ప్రారంభం : ఎయిమ్స్ డైరెక్టర్

కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ మూడో దశ ప్రారంభమైందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా వెల్లడించారు. ఈ దశలోనే కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ద్వారా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుందని తెలిపారు. 
 
ఈ థర్డ్ స్టేజ్‌పై ఆయన స్పందిస్తూ, ముంబైలాంటి కొన్ని ప్రాంతాల్లో వైర‌స్ వేగంగా వ్యాపిస్తుంద‌ని, ఇది మూడోద‌శ‌ను సూచిస్తుంద‌ని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దేశంలో ఎక్కువ భాగం స్థానిక వ్యాప్తి (స్టేజ్ 2) ద‌శ‌లోనే ఉంద‌ని గుర్తుచేశారు. 
 
వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న‌చోట వెంట‌నే నియంత్ర‌ణ చ‌ర్య‌లు తీసుకుంటే ప్రమాదాన్ని నివారించ‌వ‌చ్చ‌ని తెలిపారు. త‌బ్లిగి జ‌మాత్ స‌మావేశాల‌కు హాజ‌రైన‌వారిని త్వ‌ర‌గా గుర్తించ‌టం ఇప్పుడు చాలా ముఖ్య‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ విష‌యంలో వైద్యుల‌కు స‌హ‌క‌రించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. 
 
మరోవైపు, మ‌హారాష్ట్ర‌లో ప‌రిస్థితి మ‌రింత దారుణంగా తయారైంది. ఆ రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో 33 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మ‌హారాష్ట్ర‌లో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 781కి చేరింది. 
 
కాగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొత్తం 4374 కేసులు నమోదుకాగా, 329 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే, తెలంగాణాలో 334 కేసులు నమోదు కాగా, 33 మంది కోలుకుని ఇంటికెళ్లారు.