శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 19 జూన్ 2020 (13:43 IST)

భారత్ - చైనా సైనికుల మధ్య ఘర్షణ, ఎంతమందికి గాయాలయ్యాయి? వాళ్లు ఎక్కడున్నారు..?

గాల్వాన్ నదీ ప్రాంతంలో భారత్ -చైనా సైనికుల మధ్య సోమవారం హింసాత్మక ఘర్షణలు జరిగాయి. సముద్ర మట్టానికి 15 వేల అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న గాల్వన్ హిమ నదీ ప్రవాహ గమనాన్ని మరల్చేందుకు చైనా సైనికుల చేస్తున్న ప్రయత్నాలను భారత జవాన్లు అడ్డుకున్నారు. ఈ దాడిలో మొత్తం 76 మంది భారత సైనికులు గాయపడినట్లు సైన్యాధికారులు వెల్లడించారు.
 
మొత్తం గాయపడిన భారత సైనికుల్లో “లే” లోని హాస్పటల్లో 18 మంది చికిత్స పొందుతున్నారు. అయితే.... గాయపడి చికిత్స పొందుతున్న 18 మంది సైనికులు మరో 15 రోజులలో విధుల్లో చేరే అవకాశం ఉంది. గాయపడిన సైనికులలో మిగిలిన 56 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని భారత్ సైనికాధికారులు తెలియచేసారు.
 
వీరంతా ఓ వారంలో విధులకు హాజరౌతారని సమాచారం. కొంతమంది భారత జవాన్లు చైనా సైన్యం బందీలుగా ఉన్నారనే వార్తలపై భారత సైనికాధికారులు స్పందిస్తూ... ఘర్షణల్లో పాల్గొన్న భారత్ సైనికులందరూ ఉన్నారని, ఎవరూ “మిస్” కాలేదని స్పష్టం చేసారు.
 
గాల్వన్ హిమ నదీ ప్రవాహా గమనాన్ని అడ్డుకోవడానికి లేదా మార్చడానికి చైనా సైనికులు ప్రయత్నం చేస్తున్న అంశం చాలా స్పష్టంగా ఉపగ్రహ ఛాయాచిత్రాలు సూచిస్తున్నట్లు సమాచారం. హింసాత్మక ఘర్షణలు జరిగిన ప్రాంతానికి కిలోమీటరుకు లోపే చైనా సైనికులు గాల్వన్ హిమ నదీ ప్రవాహాన్ని అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.