కాంగ్రెస్ పార్టీకి అత్యవసర ఆత్మశోధన అవసరం : జ్యోతిరాదిత్య సింథియా

Jyotiraditya Scindia
ఠాగూర్| Last Updated: గురువారం, 10 అక్టోబరు 2019 (12:47 IST)
గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనూహ్య ఓటమి ఎదురైంది. దీంతో అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ త్యజించారు. దీంతో తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ నియమితులయ్యారు. అదేసమయంలో కాంగ్రెస్ శ్రేణులు కూడా నిస్తేజంగా మారిపోయాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని కాపాడాల్సిన రాహుల్ గాంధీ దూరంగా వెళ్లిపోతున్నారని సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను మరచిపోకముందే, యువనేత జ్యోతిరాదిత్య సింథియా సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీలో అత్యవసరంగా ఆత్మశోధన జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నాయకత్వ లేమిలో ఉందని ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని సింథియాను కోరిన వేళ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పార్టీకి చెందిన ఇతర నేతలు చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించబోనని చెబుతూనే, ఆత్మవిమర్శ అత్యవసరమని, పార్టీ పరిస్థితిని విశ్లేషించి, మరింత మెరుగైన స్థితికి చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. తాజాగా పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడిన జ్యోతిరాదిత్య సింథియా, సార్వత్రిక ఎన్నికల తరువాత, ముఖ్యంగా గత రెండు నెలలుగా, పార్టీ పరిస్థితి మరింతగా దిగజారిందని చెప్పుకొచ్చారు.దీనిపై మరింత చదవండి :