బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (13:50 IST)

బీహార్‌లో పెరుగుతున్న కల్తీ మద్యం మృతులు

బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కల్తీమద్యం సేవించి చనిపోయిన వారి సంఖ్య 21కు చేరింది. ప‌శ్చిమ చంపార‌న్ జిల్లాలోని బెట్టియ్యా ప‌ట్ట‌ణంలో క‌ల్తీ మ‌ద్యం సేవించి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇప్ప‌టికే గోపాల్‌గంజ్‌లో క‌ల్తీ మ‌ద్యం తాగి 11 మంది మ‌ర‌ణించిన విషయం తెల్సిందే. ఈ ఘ‌ట‌న‌ను మ‌రువ‌క ముందే ఇప్పుడు బెట్టియ్యాలో మ‌రో 10 మంది ప్రాణాలు పోయాయి. దాంతో బీహార్‌లో మూడు రోజుల వ్య‌వ‌ధిలో క‌ల్తీ మ‌ద్యం సేవించి మ‌ర‌ణించిన వారి సంఖ్య 21కి చేరింది.
 
మూడు రోజుల వ్య‌వ‌ధిలో రెండు జిల్లాల్లో 21 మంది క‌ల్తీ మ‌ద్యం కాటుకు బ‌లి కావ‌డంతో ప్ర‌భుత్వం ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. రెండు జిల్లాల అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసి, పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. అలాగే, ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిపై క‌ఠిన‌ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రాష్ట్ర‌మంత్రి సునీల్ కుమార్ తెలిపారు.