శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 10 జూన్ 2020 (12:27 IST)

కరోనా ఎఫెక్ట్.. 24 గంటల్లో 9,985 మరణాలు

దేశంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రోజురోజుకు కరోనా వ్యాప్తి విజృంభిస్తుండడంతో పాటు మరణాల సంఖ్య పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,985 కేసులు నమోదు కాగా, 279 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,76,583కి చేరగా.. మతుల సంఖ్య 7,745కి పెరిగింది.

ప్రస్తుతం దేశంలో 1,33,632 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆర్యో, కుటుంబ సంక్షేమ శాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది.

కాగా గడిచిన 24 గంటల్లో 1,45,216 మందికి కరోనా టెస్టులు చేశారు. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 50,61,332గా నమోదైంది.