గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 డిశెంబరు 2019 (12:51 IST)

ఢిల్లీలోని పెళ్లి మండపంలో వినూత్న నిరసన.. ఏం చేశారంటే?

ఢిల్లీలోని ఓ పెళ్ళి మండపంలో వినూత్న నిరసన చోటుచేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల రిజిస్టరుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జామియా మిలియా యూనివర్శిటీలో జరిగిన ఆందోళనల్లో పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థిని అమీనా జకియా చురుకుగా పాల్గొన్నారు. ఆమె తన పెళ్లిలో కూడా ఈ చట్టాలపై నిరసన వ్యక్తం కావాలనుకున్నారు.
 
అందుకు పెళ్లి కుమారుడితోపాటు అతని కుటుంబ సభ్యులను ఒప్పించారు. అనంతరం పెళ్లి వేడుకల్లోనే వధూవరులతోపాటు పెళ్లికి హాజరైన బంధువులు, కుటుంబసభ్యులు, అతిధులు ఈ చట్టాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు చేత బట్టి, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. 
 
పెళ్లి వేడుకలో ప్రముఖ విప్లవ రచయిత హబీబ్ జాలిబ్ రాసిన కవితలను చదువుతూ వధూవరులు నిరసన తెలిపారు. కాగా ఈ కటుంబానికి  రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. కేవలం ప్రభుత్వానికి తమ నిరసనను తెలిపేందుకే తాము పెళ్లి వేడుకలో ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబట్టామని వధువు సోదరి వెల్లడించారు.