రేపిస్టుకు బెయిల్.. బాధితురాలికి వింత తీర్పు.. 2000 మంది మహిళల బట్టలు ఉతకాలట!
దేశంలో మహిళలపై లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా… కొందరు కామాంధుల్లో మార్పు రావట్లేదు. ఇటీవలే బీహార్ రాష్ట్రంలోని మధుబానీ జిల్లాలో ఓ మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయం చూసి… ఆ మహిళపై దారుణానికి ఒడిగట్టాడు. దీంతో ఆ మహిళ పోలీసులు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే.. తాజాగా ఈ కేసులో బెయిల్ కోసం ఆ నిందితుడు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా బీహార్‌లోని మధుబానీ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లైంగిక దాడికి పాల్పడినందుకు ఆ మహిళ గ్రామంలోని 2000 మంది మహిళల బట్టలు ఉతకాలని వింత తీర్పు ఇచ్చింది. ఇదే ఈ కేసులో అతడికి శిక్ష అని పేర్కొంది. అంతేకాదు ఈ కేసులో ఆ నిందితుడుకి బెయిల్ కూడా మంజూరు చేసింది.