గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (11:47 IST)

ఉత్తరాఖండ్‌ ఐఐటీలో 90మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

ఉత్తరాఖండ్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీలో 90 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్‌గా తేలారు. మొన్నటి వరకు 60 మంది విద్యార్థులు వైరస్‌ బారినపడగా.. తాజాగా మరో 30 మంది విద్యార్థులు పాజిటివ్‌గా పరీక్షించినట్లు ఐఐటీ మీడియా సెల్ ఇన్‌చార్జి సోనికా శ్రీవాస్తవ పేర్కొన్నారు. హరిద్వార్ జిల్లా ఆరోగ్య శాఖ కోరల్, కస్తూర్బా, సరోజిని, గోవింద్ భవన్, విజ్ఞన్ కుంజ్ పేరిట ఉన్న ఐదు హాస్టళ్లకు సీల్‌ వేసి, కంటైనర్‌ జోన్లుగా ప్రకటించింది.
 
ఐఐటీ రూర్కీలో సుమారు 3వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 1,200 మంది మంది ఐదు హాస్టళ్లలో ఉంటున్నారు. ప్రస్తుతం విద్యార్థులందరూ హాస్టళ్లలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థులు కరోనా బారినపడుతుండడంతో ఐఐటీకి వచ్చేందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రావొద్దని సూచించారు. 
 
ప్రస్తుతం హాస్టళ్లలో ఉన్న విద్యార్థులందరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ఉత్తరాఖండ్‌లో గురువారం కొత్తగా 787 కొవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.