మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 మే 2024 (14:45 IST)

ముంబైలో ఒక్కిసారిగా మారిపోయిన వాతావరణం.. థానే రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట!!

women passengers
ముంబైలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ ఈదురుగాలులు, వర్షంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అస్తవ్యస్తమైన ట్రాఫిక్, రైల్వే సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రెండు గంటల పాటు లోకల్‍‌ రైళ్లు నిలిచిపయాయ. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా, ముంబైకర్లకు లైఫ్ లైన్‌గా పిలిచే లోకల్ రైళ్లు ఒక్కసారిగా రెండు గంటల పాటు ఆగిపోవడంతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. 
 
థానే రైల్వే స్టేషన్‌లో ఓ లోకల్ రైలు ఎక్కేందుకు ప్రయాణికులంతా ఒకేసారి దూసుకుని రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అప్పటికే పూర్తిగా నిండిన రైలు ఎక్కేందుకు వందలాది మంది మహిళలు ఫ్లాట్ ఫాంపై తోసుకుని వస్తున్నట్టుగా వీడియోలో కనిపించారు. దీంతో రైల్వే అధికారుల తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. ఇంత పెద్ద మహానగరానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు విచిత్రమంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 
మరోవైపు, విద్యుత్ స్తంభం వంగిపోవడంతో సెంట్రల్ రైల్వే స్టేషన్ పరిధిలో గంటకుపైగా రైలు సేవలను నిలిపివేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. అలాగే, పశ్చిమ రైల్వే స్టేషన్ పరిధిలో సిగ్నల్ వైఫలం వల్ల లోకల్ రైళ్లు 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా నడిచినట్టుగా వివరించారు. అలాగే, లైన్ 7 మార్గంలో విద్యుత్ లైన్‌ పై భారీ ప్లెక్సీ పడటంతో రైలు సర్వీసులకు ఆటంకం కలిగినట్టు వివరించారు. దీంతో ముంబైకర్లు ఇళ్లకు చేరేందుకు పడరాని పాట్లు పడ్డారు. కొందరైతే పట్టాలపై నడుచుకుంటా వెళ్లడం కనిపించింది.