మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 మే 2024 (20:21 IST)

ముంబైని తాకిన తుఫాను.. గాలిలోకి ఎగిరిన పైకప్పులు.. 36 మందికి గాయాలు

Mumbai
Mumbai
దేశ వాణిజ్య రాజధాని ముంబైని తుఫాను ముంచెత్తింది. తుఫాను కారణంగా వేగంగా వీచిన గాలులతో  ముంబైలోని పలు పరిసరాలు భారీ దుమ్ముతో కమ్ముకుపోయాయి. తుఫాను తాకిన తర్వాత వివిధ సంఘటనలలో కనీసం 36 మంది గాయపడ్డారని, రాబోయే కొద్ది గంటల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
 
తుఫాను, ఈదురు గాలులు, తేలికపాటి వర్షాలతో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దాదాపు 66 నిమిషాల పాటు సేవలను నిలిపివేయాల్సి వచ్చింది.
 
ముంబై ఘట్కోపర్ తూర్పులోని పంత్ నగర్ వద్ద పెట్రోల్ పంపుపై ఒక భారీ మెటల్ హోర్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో కనీసం 35 మంది గాయపడ్డారు.