శుక్రవారం, 4 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఏప్రియల్ 2025 (14:52 IST)

ప్రధాని మోడీ గారూ.. సమయం ఇవ్వండి.. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించాలి : సీఎం స్టాలిన్

mk stalin
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు, తమ ఆందోళనను తెలియజేసేందుకు తమకు సమయం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ మేరకు గత నెల 27వ తేదీన ఆయన మోడీకి లేఖ రాసినట్టు స్టాలిన్ బుధవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. 
 
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగనుందన్న విషయంపై చర్చించేందుకు వివిధ పార్టీల నేతలతో ఇటీవల స్టాలిన్ అఖిలపక్షం సమావేశం నిర్వహించిన విషయం తెల్సిందే. పునర్విభజనపై పలు తీర్మానాలు చేశారు. ఈ క్రమంలో దీనికి సంబంధించిన మెమోను అందించేందుకు మోడీని సమయం కోరినట్టు స్టాలిన్ తెలిపారు. ఈ కీలక అంశంపై మా వినతి వినిపించేందుకు అత్యవసంగా సమయం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంహగా అభ్యర్థించారు. ప్రధాని మోడీ స్పందన కోసం ఎదురు చూస్తున్నట్టు వెల్లడించారు.