గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (10:47 IST)

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి...

kejriwal
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తులకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉంటున్న కేజ్రీవాల్‌కు మూడు పుస్తకాలు, ఇంట్లో వండిన ఆహారంతో పాటు మందులు ఇచ్చేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే, వైద్యుల సూచన మేరకు ఒక కుర్చీ, టేబుల్ కూడా ఏర్పాటు చేయాలని జైలు అధికారులు ఆదేశించారు. ముఖ్యంగా, కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనకు బీపీ, షుగర్ లెవల్స్ ఎప్పటికపుడు పర్యవేక్షించాలన జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. 
 
మద్యం స్కామ్‌‍లో కేజ్రీవాల్‌ను ఈ నెల 15వ తేదీ వరకు జ్యూడీషియల్ రిమాండ్‌ విధించిన విషయం తెల్సిందే. అయితే, జైలులో చదువుకోవడానికి పుస్తకాలు సమకూర్చాలని, ఇంట్లో చేసిన ఆహారానికి అనుమతించాలంటూ కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనకు కోర్టు ఆమోదం తెలిపింది. భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ ఈ మూడు పుస్తకాలను కేజ్రీవాల్‌కు అందించేందుకు కోర్టు అనుమతించింది. కేజ్రీవాల్ తన ఇంట్లో వండిన భోజనం, మందులు, ఇంట్లో వాడే పరువులు, దిండ్లతో పాటు ఇతర నిత్యావాసరాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు, జైలులో ఆయనకు మతపరమైన లాకెట్ కేటాయింపునకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. 
 
నిజానికి జైలు మాన్యువల్ ప్రకారం వైద్యులు సూచించిన విధంగా ఒక టేబుల్, కుర్చీలకు కూడా అనుమతి ఇచ్చింది. అయితే, జైలు నిబంధనల ప్రకారం వైద్యులు సూచిన విధంగా ఒక టేబుల్, కుర్చీలకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, జైు నిబంధనల ప్రకారం వస్తువులు అన్నింటినీ జైలు అధికారులు పరిశీలిస్తుంటారని కోర్టు తెలిపింది. పుస్తకాలు, నోట్ ప్యాడ్‍లు, పెన్నులు కావాలని కేజ్రీవాల్ కోరితే పరిగణనలోకి తీసుకోవాలని జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది. మరోవైపు, అరవింద్ కేజ్రీవాల్ బీపీ, షుగర్ లెవల్స్‌ను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. కాగా, కేజ్రీవాల్‌ను తీహార్ జైలులోని రెండో నంబరు జైలులో ఉంచారు. అక్కడ 24 గంటల సీసీటీవీ నిఘా ఉంటుంది. 
 
కాగా, కేజ్రీవాల్ ఉదయం 6.30 గంటలకే మేల్కోవాల్సి ఉంటుందని జైలు అధికారులు చెబుతున్నారు. టీవీ సదుపాయం ఉందని, అయితే ప్రభుత్వ చాలెన్స్ మాత్రమే చూడాల్సి ఉంటుందని వివరించారు. మరోవైపు, మంగళవారం సాయంత్రం 4 గంటలకు కేజ్రీవాల్ తన న్యాయవాదులను జైలులోనే కలవనున్నారు.