గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 24 ఆగస్టు 2017 (11:35 IST)

పడక గదిలో భర్త అసహజ శృంగారం.. నవ వధువు సూసైడ్.. ఎక్కడ?

పడక గదిలో భర్త అసహజ శృంగారాన్ని భరించలేని ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఒకటి ఢిల్లీలోని నోయిడాలో వెలుగులోకి వచ్చింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఈ వివరాలను పరిశీలిస్తే..

పడక గదిలో భర్త అసహజ శృంగారాన్ని భరించలేని ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఒకటి ఢిల్లీలోని నోయిడాలో వెలుగులోకి వచ్చింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
మీరట్ పట్టణానికి చెందిన దీపశిఖ అనే యువతికి నోయిడాలోని సెక్టార్ 78కు చెందిన సంజయ్‌తో వివాహం జరిగింది. ఈయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి ఉద్యోగిగా పని చేస్తున్నాడు. 
 
అయితే, వివాహం తర్వాత సంజయ్ పడక గదిలో అసహజ శృంగారం పేరుతో భార్యను వేధించసాగాడు. ఈ వేధింపులను భరించలేని ఆ నవవధువు భర్త ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. 
 
ఆత్మహత్య సమయంలో ఆమె అత్త మాత్రం ఇంట్లోనే ఉందని పోలీసులు పేర్కొన్నారు. దీపశిఖ తల్లిదండ్రుల ఫిర్యాదు మేర పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.