గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 జూన్ 2023 (13:35 IST)

ఉన్నావ్‌లో 59 ఏళ్ల వ్యక్తి పెద్దకర్మ చేసుకున్నాడు.. మూడు పెళ్లిళ్లు..?

Up Man
Up Man
యూపీలోని ఉన్నావ్ జిల్లాలో ఓ 59 ఏళ్ల వ్యక్తి బతికుండగానే తనకు తానే పెద్దకర్మ చేసుకున్నాడు. అంతేగాకుండా.. మూడేళ్ల క్రితం వ్యవసాయ క్షేత్రంలో ఏకంగా తన సమాధిని కూడా నిర్మించుకున్నాడు. తాను మరణించాక అదే సమాధిలో పాతిపెట్టాల్సిందిగా కుటుంబ సభ్యులను కోరాడు. కొద్ది వారాల క్రితం తనను తాను పిండం పెట్టుకునే కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. ఈ కార్యక్రమానికి అనంతరం గ్రామస్తులను పెద్దకర్మకు ఆహ్వానించాడు. 
 
గురువారం రాత్రి తన పెద్దకర్మను పూర్తి చేశాడు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, బంధువులు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా 300 మందికి విందు ఏర్పాటు చేశారు. 59 ఏళ్ల జఠాశంకర్ అనే ఈ వ్యక్తి  మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇంకా ఏడుగురు సంతానం. కానీ తాను చనిపోయిన తర్వాత తన పెద్ద కర్మ చేస్తారో లేదోనని ముందుగానే ఈ తతంగాన్ని చేసుకున్నాడు.