2021లో మొబైల్ యాప్‌తో జనాభా లెక్కలు
డిజిటల్ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు చేపట్టనున్నది. 2021లో డిజిటల్ ప్రక్రియ ద్వారా జనాభా గణన ఉంటుందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. ఒక ప్రత్యేకమైన డిజిటల్ యాప్ ద్వారా దేశ జనాభాను లెక్కించనున్నట్లు ఆయన వెల్లడించారు. పేపర్ నుంచి డిజిటల్ జనాభా లెక్కింపు దిశగా పరివర్తన జరుగుతుందన్నారు.
ఆయన సోమవారం ఢిల్లీలో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(ఆర్‌జీఐ) కొత్త బిల్డింగ్ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి షా పాల్గొన్నారు. దేశంలో జనాభా లెక్కలు నిర్వహించేంది ఆర్‌జీఐ మాత్రమే. డిజిటల్ లెక్కింపు ద్వారా.. ఆధార్, పాస్‌పోర్ట్, బ్యాంక్ అకౌంట్, డ్రైవింగ్ లైసెన్సు లాంటి కార్డులన్నీ ఒకే ఫ్లాట్‌ఫామ్‌పైకి వస్తాయన్నారు.
జనాభా లెక్కింపు ప్రక్రియ డేటాతో జనన, మరణధృవీకరణ పత్రాలను జతచేయడానికి ఎందుకు ఇబ్బందిపడడం అని ఆయన ప్రశ్నించారు. నేషనల్ పాపులేషన్ రిజస్టర్ (ఎన్‌పీఆర్), జనాభా లెక్కల కోసం సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి పౌరుడి బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ వివరాలను ఎన్‌పీఆర్‌తో అనుసంధానం చేస్తామని ఆయన తెలిపారు.