శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 నవంబరు 2019 (15:35 IST)

శరద్ పవార్ వారసురాలివి నీవే సుప్రియా : డిగ్గీరాజా

మహారాష్ట్ర రాజకీయాల్లో మరాఠా యోధుడుగా గుర్తింపు పొందిన నేత శరద్ పవార్. ఇంతకాలం ఈయన వారసుడు ఆయన అన్న కుమారుడు అజిత్ పవార్ అని ప్రతి ఒక్కరూ భావిస్తూ వచ్చారు. కానీ, ఆయన తీసుకున్న అనూహ్య నిర్ణయం వల్ల ఇపుడు ఆయన ఏకాకి అయ్యారు. 
 
ఎన్సీపీని చీల్సి బీజేపీకి మద్దతు ఇవ్వాలని కలలుగన్నాడు. దీంతో ఆయనకు ఉప ముఖ్యమంత్రిపదవిని బీజేపీ ఆఫర్ చేసింది. ఈ ఆఫర్‌తో ఉబ్బితబ్బిబ్బులైన అజిత్ పవరా తెల్లారేసరికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. 
 
ఎన్సీపీని మోసం చేస్తూ అజిత్ పవార్ సొంత నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటికే అజిత్ పవార్‌పై ఆ పార్టీ అధిష్టానం వేటువేసింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇక శరద్ పవార్ రాజకీయ వారసురాలు ఆయన కూతురు సుప్రియా సూలెనే అంటూ ట్వీట్ చేశారు.
 
'ఎన్సీపీ నుంచి గెలిచిన 54 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు 53 మంది శరద్ పవార్ వెంటే ఉన్నారు. అజిత్ పవార్ ఒంటరి అయ్యారు. ఇప్పుడు శరద్ పవార్ వారసురాలివి నువ్వే సుప్రియ సూలె' అంటూ దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.