1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (17:44 IST)

జయమ్మ ఆస్తులు ఎవరి ఆధీనంలో ఉన్నాయ్.. రూ.100కోట్ల జరిమానా కోసం వేలం వేస్తారా?

దివంగత మాజీ సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళా నటరాజన్ నిర్ధారిస్తూ.. ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఆమోదించింది.

దివంగత మాజీ సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళా నటరాజన్ నిర్ధారిస్తూ.. ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఆమోదించింది. అనారోగ్యంతో గత డిసెంబర్ ఐదో తేదీన మరణించిన జయలలితతోపాటు ఈ అక్రమాస్తుల కేసులో శశికళ, ఇళవరసు, వికె దినకరన్ తదితరులు నిందితులు. ఇదే అక్రమాస్తుల కేసులో పోలీసులు జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు ప్రస్తుతం బెంగళూరు కోర్టు ఆధీనంలో ఉన్నాయి. ఈ కేసులో రూ.100 కోట్ల జరిమానా రాబట్టుకునేందుకు ఈ ఆస్తులను వేలం వేసే అవకాశం ఉంది. 
 
ఈ ఆస్తుల వివరాల్లోకి వెళితే.. జయలలిత వాడిన 750 జతల చెప్పులు కూడా ఉన్నాయి. వాటితోపాటు 10,500 చీరలు ఉన్నాయి. వాటిలో 750 చీరలు పసిడి, సిల్క్‌తో తయారుచేసినవే కావడం గమనార్హం. ప్రస్తుతం బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఆధీనంలో ఉన్న ఈ వస్తువులను ఆ నగర పోలీసులు రేయింబవళ్లు కాపలా కాస్తున్నారు.

సుప్రీంకోర్టు కూడా అక్రమాస్తుల కేసులో ప్రత్యేక న్యాయస్థానం తీర్పును ఆమోదించడంతో సదరు వస్తువులను జరిమానా రాబట్టుకునేందుకు తమిళనాడుకు తీసుకొచ్చి వేలం వేసే అవకాశం ఉంది.