శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 14 మే 2019 (17:15 IST)

స్టాలిన్‌తో కేసీఆర్ చర్చలు .. చంద్రబాబుతో దురైమురుగన్ భేటీ

డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యం, తాజా రాజకీయ పరిణామాలపై స్టాలిల్ - కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. 
 
ఈ క్రమంలో డీఎంకే కోశాధికారి, పార్టీ సీనియర్ నేత అయిన దురైమురుగన్ మంగళవారం అమరావతికి వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగ కేసీఆర్ - స్టాలిన్‌ల మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని చంద్రబాబుకు దురైమురుగన్ వివరించినట్టు సమాచారం.