1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2016 (16:33 IST)

కోలుకుంటున్న జయలలిత.. అస్వస్థతకు గురైన కరుణానిధి... ఇంట్లోనే వైద్యం

తీవ్ర అనారోగ్యం కారణంగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారు. ఆమె ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారనీ, ఈనెల 30వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావొచ్చంటూ ప్ర

తీవ్ర అనారోగ్యం కారణంగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారు. ఆమె ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారనీ, ఈనెల 30వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావొచ్చంటూ ప్రచారం సాగుతోంది. అయితే, జయలలిత కోలుకుంటున్న తరుణంలో డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అస్వస్థతకు గురికావడం పట్ల తమిళనాట ఆందోళన వ్యక్తమవుతోంది.
 
కరుణానిధి మంగళవారం అస్వస్థతకు గురయ్యారని డీఎంకే అధికారికంగా వెల్లడించింది. రోజువారీ మందులు పడక ఆయన అలర్జీకి గురయ్యారని, దీంతో ఆయనను ఇంట్లోనే ఉంచి ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరిగిందని, ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని డీఎంకే ఆ ప్రకటనలో తెలిపింది. మరికొంతకాలం ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారని డీఎంకే స్పష్టం చేసింది.