నీ భార్యతో నాకు అక్రమ సంబంధం అంటగడతావా..? ఆ డాక్టర్ ఆసిడ్‌లో?

Last Updated: బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (10:55 IST)
దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతుంది. వివాహేతర సంబంధాలు నేరాల సంఖ్యను పెంచేస్తుంది. ఓ డ్రైవర్ తన భార్యకు ఓ డాక్టర్‌కు వివాహేతర సంబంధం అంటగట్టాడు. దీంతో ఆ డాక్టర్ డ్రైవర్‌ని చంపి ముక్కలు ముక్కులుగా కోసి... యాసిడ్‌లో దాచిపెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్‌లో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్‌లో ఆర్థోపెడిక్ డాక్టర్ సునీల్ (56). 30 ఏళ్లుగా సునీల్ వద్ద కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడు వీరేంద్ర. డాక్టర్ బొటిక్ నిర్వహించేది. 
 
కానీ ఆమె మరణించడంతో డ్రైవర్ భార్యకు ఆ బొటిక్‌ని ఇచ్చిన డాక్టర్... దాన్ని నిర్వహించుకోమని చెప్పారు. అది చూసిన డ్రైవర్‌ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. డాక్టర్‌తో వివాహేతర సంబంధం నడుపుతోందనీ, అందుకే ఆమెకు బొటిక్ ఇచ్చాడని అపార్థం చేసుకున్నాడు. ఇంకా భార్యను తరచూ వేధించేవాడు.

ఈ విషయాన్ని భరించలేక డాక్టర్‌తో చెప్పేసింది.. డ్రైవర్ భార్య. కానీ డాక్టర్ డ్రైవర్‌పై కసి పెంచుకున్నాడు. అతని భార్యకు తనకు వివాహేతర సంబంధాన్ని అంటగట్టాడనే కోపంతో హత్య చేశాడు. 
 
ఆపై డ్రైవర్ శరీరాన్ని రంపంతో కోసి యాసిడ్‌లో దాచిపెట్టాడు. అయితే డాక్టర్ ఇంటి నుంచి దుర్గంధం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు వచ్చిన పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా డాక్టర్‌ను పట్టుకొని అరెస్టు చేశారు. 
 
తన భర్తను చంపేయడంతో... కన్నీటి సంద్రమైంది డ్రైవర్ భార్య. భర్తకు నచ్చజెప్తాడని డాక్టర్‌తో తనకు ఎదురైన వేధింపుల గురించి చెప్పానని, కానీ ఆయన హత్య చేస్తాడని అనుకోలేదని డ్రైవర్ భార్య వాపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.దీనిపై మరింత చదవండి :