శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (11:50 IST)

మాయావతి సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పోటీ చేసేది లేదని?

యూపీ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత కుమారి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు ఆమె మీడియాకు చెప్పారు. ఎస్పీతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ యూపీలో అత్యధిక సీట్లలో పోటీ చేస్తోంది.


ఆమె ప్రధాని అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరికీ షాక్‌ను ఇచ్చింది. అభిమానులు బాధపడనక్కర్లేదని మాయావతి వెల్లడించారు. 
 
ఇదిలా ఉంటే.. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ కంటే ఎస్పీ, బీఎస్పీ కూటమి అధిక స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టుడే తన తాజా సర్వేలో వెల్లడించింది. యూపీలోని మొత్తం 80 లోక్ సభ స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీ 40 స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపింది.
 
గత సర్వేతో పోల్చితే ప్రధాని అభ్యర్థిగా మోదీ మోదీ పాప్యులారిటి మరింత పెరిగిందని వెల్లడించింది. జనవరిలో నిర్వహించిన సర్వేలో మోదీ ప్రధాని కావాలని 51 శాతం మంది ప్రజలు కోరుకోగా... తాజాగా ఆయన ప్రధాని కావాలని 55 శాతం మంది కోరుకుంటున్నారని తెలిపింది.