గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2024 (10:31 IST)

దూరదర్శన్ ప్రస్థానంలో కీలక మైలురాయి., 7 వసంతాలు పూర్తి

dooradarshan
ఒకపుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే దూరదర్శన్ చానెల్ ప్రసారాల కోసం దేశ ప్రజలంతా అమితాసక్తితో ఎదురు చూసేవారు. ఇంటిల్లిపాదినీ ఆలరించే ప్రసార సంస్థగా దూరదర్శన్ గతంలో వన్నెకెక్కింది. రామాయణ్, మహాభారత్ వంటి అనేక హిట్ కార్యక్రమాలతో బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. అలా, ప్రైవేట్ టీవీ చానెల్స్ రాకముందు దూరదర్శన్ (డీడీ) ఓ వెలుగు వెలిగింది. అలాంటి దూరదర్శన్ ప్రస్థానంలో ఓ మైలురాయికి చేరింది. డీడీ ప్రారంభించి 65యేళ్ళు పూర్తయ్యాయి. 
 
దూరదర్శన్ నేటితో 65 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1959 సెప్టెంబరు 15వ తేదీన దూరదర్శన్ ప్రారంభమైంది. 1982లో ఇది జాతీయ ప్రసారకర్తగా అవతరించింది. ప్రభుత్వ అధీనంలో నడిచే ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 46 స్టూడియోలు ఉన్నాయి. దూరదర్శన్ కింద 33 టీవీ చానళ్లు ఉన్నాయి. ఇందులో డీడీ నేషనల్, డీడీ న్యూస్ పాన్ ఇండియా చానళ్లు. 
 
అంతేకాకుండా, దూరదర్శన్ అధీనంలో 17 ప్రాంతీయ చానళ్లు, 11 రాష్ట్ర స్థాయి నెట్‌వర్క్‌లు, ఓ ఇంటర్నేషనల్ చానల్ (డీడీ ఇండియా) ఉన్నాయి. క్రీడా ప్రసారాల కోసం డీడీ స్పోర్ట్స్, సాంస్కృతిక, సమాచార, వ్యవసాయ అంశాల ప్రసారం కోసం డీడీ భారతి, డీడీ ఉర్దూ, ఓ వ్యవసాయ చానల్ ఉన్నాయి. 
 
80వ దశకంలో మహాభారత్, రామాయణ్ వంటి సీరియళ్లతో ప్రతి ఇంట్లోనూ దూరదర్శన్ చానల్ సందడి చేసింది. అయితే, 90వ దశకం ఆరంభంలో ఆర్థిక సంస్కరణలకు తెరలేపడంతో ఎన్నో ప్రైవేటు చానళ్లు భారత్‌లో ప్రవేశించాయి. అప్పటి నుంచి దూరదర్శన్‌కు ప్రజాదరణ తగ్గడం మొదలైంది.
 
ఇక, సంచనాలకు దూరంగా ఉంటుందని పేరొందిన దూరదర్శన్ చానల్‌పై కూడా వివాదాలు ఉన్నాయి. ఇందిర హయాంలో ఎమర్జెన్సీ వేళ ప్రభుత్వ భావజాలాన్ని వ్యాప్తి చేసే వాహకంగా దూరదర్శన్ అప్రదిష్ట మూటగట్టుకుంది. 1984లో అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలోనూ ప్రభుత్వ వార్తలనే ప్రసారం చేసిన దూరదర్శన్ విమర్శలపాలైంది.