శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (07:42 IST)

నేడు విచారణకు బ్రేక్ ఇచ్చిన ఈడీ - అమ్మ చెంతకు రాహుల్

rahul gandhi
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం బ్రేక్ ఇచ్చారు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని, అందువల్ల విచారణను సోమవారానికి వాయిదా వేయాలంటూ రాహుల్ లేఖ రాశారు. కానీ, ఈడీ అధికారులు మాత్రం శుక్రవారం ఒక్క రోజు విచారకు బ్రేక్ ఇచ్చారు. పైగా, శనివారం విచారణ కొనసాగిస్తారా లేదా వాయిదా వేస్తారా అనే అంశంపై సస్పెన్స్‌గా ఉంచారు. 
 
నేషనల్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గత మూడు రోజులుగా విచారిస్తున్న విషయం తెల్సిందే. ఈ విచారణలో భాగంగా, ఇప్పటివరకు మొత్తం 28 గంటల పాటు విచారిచారు. శుక్రవారం కూడా విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. 
 
అయితే, ఈ విచాణమను సోమవారానికి వాయిదా వేయాలని రాహుల్ గాంధీ ఈడీని కోరారు. ఈ మేరకు ఈడీకి లేఖ రాశారు. తన తల్లి సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతోందని ఆమె ఆస్పత్రిలో ఉందని లేఖలో వివరించారు. దీంతో శుక్రవారం విచారమకు ఈడీ అధికారులు బ్రేక్ ఇచ్చారు. అయితే ఈడీ వర్గాల సమాచారం మేరకు రాహుల్ వినతికి ఈ నెల 20వ తేదీ సోమవారానికి వాయిదా వేసినట్టు సమాచారం.