శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 8 మే 2023 (10:54 IST)

దేశంలో దిగివస్తున్న వంట నూనెల ధరలు

cooking oil
దేశంలో వంట నూనెల ధరలు దిగివస్తున్నాయి. ఉక్రెయిన్‌లో కొంతమేరకు పరిస్థితులు చక్కబడ్డాయి. దీంతో అక్కడి నుంచి వంట నూనెలలు భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. దీంతో దేశంలో సన్‌ఫ్లవర్, సోయాబీన్ మంటి మూడి నూనెల ధరలు భారీగా దిగివచ్చాయి. గత యేడాదితో పోల్చితే 46 శాతం నుంచి 57 శాతం మేరకు దిగివచ్చాయి. 
 
ముడి చమురు ధరల్లో తగ్గుదల కనిపించడంతో వంట నూనెల ధరలు కూడా రిటైల్ మార్కెట్లో ఈ తగ్గుదల 16-17 శాతంగానే ఉండనుంది. ఎస్ఈఏఐ గణాంకాల మేరకు.. దిగుమతి చేసుకునే ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర.. సోయాబీన్, పామాయిల్ ధరలకంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం ముంబైలో ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర టన్ను రూ.81,300 ఉండగా, టన్ను ముడి పామాయిల్ ధర రూ.82,000, టన్ను ముడి సోయాబీన్ నూనె ధర రూ.85,400 ఉంది. 
 
ఏడాది క్రితం ముడి పామాయిల్, సోయాబీన్ నూనె ధరల కంటే సన్ ఫ్లవర్ ఆయిల్ ధరే (రూ.17 లక్షలు) అధికంగా ఉండేది. 'ఉక్రెయిన్ నుంచి మళ్లీ సరఫరా ప్రారంభంకావడంతో సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అధికంగా ఉంది. దీంతో నిల్వలు పెరిగి ధరలు తగ్గాయి అని ఎస్ఈఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా చెప్పారు. అయితే హోల్‌‌సేల్, రిటైల్ మార్కెట్లో తగ్గింపు ధరలు అందుబాటులోకి రావాలంటే కొంత సమయం పడుతుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి.