గురువారం, 18 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 16 మార్చి 2024 (12:17 IST)

నా ఆరోగ్యంపై వచ్చినవన్నీ ఫేక్ వార్తలు, నేను మ్యాచ్ చూసేందుకు వచ్చాగా: అమితాబ్ బచ్చన్

amitabh
తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవనీ, ఎవరో పనిగట్టుకుని పేక్ వార్తలు సృష్టించారని చెప్పారు బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ పోటీలకు ఆయన సచిన్ టెండూల్కర్ తో కలిసి హాజరయ్యారు. ఆయనను చూసిన మీడియా వారు తన ఆరోగ్యంపై వాకబు చేసారు. దీనితో ఆయన తను చాలా ఆరోగ్యంగా వున్నట్లు చెప్పారు.
 
మార్చి 15న ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో అమితాబ్ బచ్చన్ ఆంజియోప్లాస్టీ చేయించుకునేందుకు ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. కానీ బిగ్ బీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్నారు. తాజాగా ఆయన "ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా" అని రాసారు. దీంతో అమితాబ్ ఆరోగ్యానికి సమస్యేమీ లేదని చెప్పేందుకే ఈ పోస్టు పెట్టివుంటారని ఫ్యాన్స్ భావించారు. వారు అనుకున్నదే జరిగింది.