సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2017 (11:37 IST)

'మీరు ఇంటర్వ్యూ చేస్తున్నది మాజీ రాష్ట్రపతి'ని.. రాజ్‌దీప్‌కు ప్రణబ్ వార్నింగ్ (వీడియో వైరల్)

ఎలాంటి క్లిష్టపరిస్థితులు, కష్టనష్టాలు ఎదురైనప్పటికీ ప్రశాంతవదనంతో కనిపించే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ దాదాకు కోపం వచ్చింది. సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూ చేస్తుండగా, ఆయనకు ఆగ్రహం కట్టల

ఎలాంటి క్లిష్టపరిస్థితులు, కష్టనష్టాలు ఎదురైనప్పటికీ ప్రశాంతవదనంతో కనిపించే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ దాదాకు కోపం వచ్చింది. సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూ చేస్తుండగా, ఆయనకు ఆగ్రహం కట్టలుతెంచుకుంది. దీంతో లైవ్‌లోనే రాజ్‌దీప్‌పై మండిపడ్డారు. దేశ రాష్ట్రపతిగా పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ప్రణబ్ ముఖర్జీ తొలిసారి ముఖాముఖీలో పాల్గొన్నారు. దాదాను ఇంటర్వ్యూ చేసే అవకాశాన్ని రాజ్‌దీవ్ సర్దేశాయ్ దక్కించుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ప్రణబ్ దాదా అసహనానికి లోనయ్యారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... ప్రణబ్ దాదాను సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నకు ప్రణబ్ ముఖర్జీ సమాధానమిస్తున్నారు. మధ్యలో రాజ్‌దీప్ కల్పించుకుని ఏదో ప్రశ్న వేయబోయారు. దీంతో ప్రణబ్ తీవ్ర ఆసహనానికి లోనయ్యారు. 'ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నది ఒక మాజీ రాష్ట్రపతిని' అంటూ హెచ్చరించారు. తాను మాట్లాడుతున్నప్పుడు కల్పించుకునే ప్రయత్నం చేయరాదని... ఆ మాత్రం కర్టసీ మెయింటైన్ చేయాలని అన్నారు. 
 
టీవీ స్క్రీన్‌పై కనిపించాలన్న తపన తనకు లేదని... మీరు ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తేనే తాను వచ్చానని చెప్పారు. దీంతో, మాజీ రాష్ట్రపతికి రాజ్‌దీప్ క్షమాపణలు చెప్పారు. సుమారు 45 నిమిషాల పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలోని ప్రణబ్ అసహనం వ్యక్తం చేసిన బిట్ మాత్రం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోనూ మీరూ చూడండి.