బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (13:48 IST)

రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్‌ లైసెన్సులు పొడిగింపు

ఇప్పటికే కాలపరిమితి ముగిసిపోయి రెన్యువల్‌ కాని వాహనాల లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, పర్మిట్లను జూన్‌ నెలాఖరు వరకు పొడిగించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆదేశించింది.

ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్లు పంపింది. ప్రధానంగా ఫిబ్రవరి ఒకటి తరువాత కాలపరిమితి ముగిసిపోయిన వాటికి ఈ పొడిగింపు వర్తిస్తుందని పేర్కొంది.

కరోనా నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ప్రకటించడం వల్ల అత్యవసర సమయంలో ప్రజా రవాణా, సరుకుల రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.