మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 జూన్ 2021 (13:27 IST)

కూతురిపై లైంగికదాడి.. ఎవరికైనా చెబితే తమ్ముడిని చంపేస్తానని..?

మహిళలపై, వయోబేధం లేకుండా వావి వరుసలు లేకుండా అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కూతురు పట్ల కీచకుడిగా మారాడు. 19 ఏండ్ల వయసున్న కూతురుపై మూడేండ్లుగా తండ్రి లైంగిక దాడికి ఒడిగట్టాడు. 

ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని అయిష్‌బాగ్ ఏరియాలో చోటు చేసుకుంది. మూడేండ్ల నుంచి కూతురిపై లైంగికదాడికి పాల్పడుతూ బయటకు విషయం చెబితే చంపేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నాడు తండ్రి. 

సోమవారం కూడా తండ్రి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే.. తల్లిని, సోదరుడిని కిటికీలో నుంచి బయటకు తోసేస్తానని బెదిరించాడు. తండ్రి వేధింపులు భరించలేని ఆ యువతి తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

మూడేండ్ల క్రితం తాను ఒంటరిగా ఉన్న సమయంలో తండ్రి లైంగికదాడి చేశాడని, ఎవరికైనా చెబితే తమ్ముడిని చంపేస్తానని బెదిరించాడు అని బాధిత యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.