గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 30 జులై 2023 (13:18 IST)

రాజస్థాన్ ఆస్పత్రి బేస్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం... రోగుల తరలింపు

fire accident
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఉన్న రాజస్థాన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఆస్పత్రిలోని బేస్‌మెంట్‌లో ఈ ప్రమాదం సంభవించడంతో అందులోని 125 మంది రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు సాహిబాగ్ పోలీస్ స్టేషన్‌ అధికారి తెలిపారు. 
 
అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ముందు జాగ్రత్త చర్యగా ఆస్పత్రిలోని రోగులందరినీ ఇతర ఆస్పత్రులకు తరలించారు. అగ్నిమాపకదళ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ ఆస్పత్రిని చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. అయితే, అగ్నిమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.