1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 27 జూన్ 2023 (13:41 IST)

వీర్యం తారుమారు... ఆస్పత్రికి రూ.1.5 కోట్ల అపరాధం... ఎక్కడ?

sperm count
కృత్రిమ గర్భధారణ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళకు తన భర్త వీర్యానికి బదులు మరో వ్యక్తి వీర్యం ఎక్కించిన ఆస్పత్రికి జాతీయ వినియోగదారుల ఫోరం భారీ అపరాధం విధించింది. ఈ కేసులో ఏకంగా రూ.1.5 కోట్ల ఫైన్ చెల్లించాలంటూ ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం షాక్‌కు గురైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బాధిత జంట అసిస్టెడ్ రిప్రోడక్టివ్ టెక్నిక్‌తో సంతాన భాగ్యం పొందేందుకు సదరు ఆస్పత్రిని ఆశ్రయించారు. ఫలితంగా వారికి 2009లో కవల పిల్లలు జన్మించారు. ఆ తర్వాత శిశువులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా ఆ పిల్లల తండ్రి మరొకరని తేలింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది చేసిన పొరపాటు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన దంపతులు న్యాయపోరాటానికి దిగారు. 
 
తమకు సదరు ఆస్పత్రి రూ.2 కోట్ల అపరాధం చెల్లించాలంటూ జాతీయ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఈ కేసుపై కొన్నేళ్లపాటు సుధీర్ఘ విచారణ జరిగింది. చివరకు బాధితులకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. కృత్రిమ గర్భధారణ విధానాల సాయంతో జన్మించిన శిశువు డీఎన్ఏ ప్రొఫైల్ తయారు చేసి ఇచ్చేనా నిబంధనలు రూపొందించాలని ఈ సందర్భంగా కమిషన్ అభిప్రాయపడింది. అయితే ఈ పొరపాటు చేసిన ఆస్పత్రి వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు.