పంపానది ఉధృతం.. వరద నీటిలో మునిగిన అయ్యప్ప స్వామి ఆలయం
కేరళలో వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో జిల్లాలు నీట మునిగాయి. భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లుతున్న కేరళ ప్రజలను ఆదుకునేందుకు అందరూ ముందడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో
కేరళలో వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో జిల్లాలు నీట మునిగాయి. భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లుతున్న కేరళ ప్రజలను ఆదుకునేందుకు అందరూ ముందడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రజలను మనమందరం కలిసి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
కేరళ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం తరఫున రూ.5 కోట్ల విరాళం ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 167కు చేరిందని సీఎం పినరయి విజయన్ శుక్రవారం వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. ఆగస్టు 8వ తేదీ నుంచి వర్షాలు దంచి కొడుతుండటంతో కేరళ జలవిలయంలో చిక్కుకుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కు వారిని సురక్షిత ప్రాంతాలకు సహాయక బృందాలు తరలిస్తున్నాయి. ఇప్పటివరకు రెండు వేల 94 క్యాంపులు ఏర్పాటు చేసి మూడున్నర లక్షల మందిని సహాయక శిబిరాలకు తరలించారు.
పతనంతిట్ట, అలప్పూజ, ఎర్నాకులం, త్రిశూర్, కొచ్చి జిల్లాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. శుక్రవారం ఒక్క రోజే వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 82వేల మందిని సహాయక బృందాలు రక్షించాయి. మరోవైపు పంపానది ఉధృతంగా ప్రవహించడం, వివిధ డామ్‌ల నుంచి గేట్లు ఎత్తివేడంతో అయ్యప్పస్వామి ఆలయ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో అయ్యప్ప స్వామి ఆలయాన్ని మూతవేశారు. చాలామంది ఆలయంలోనే వుండిపోయారు.