బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (13:43 IST)

కాంగ్రెస్ పార్టీసి సుస్మిత రాజీనామా - టీఎంసీ తీర్థమా?

కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ, మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితా దేవ్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖను పంపారు. ఆమె రాజీనామాతో పార్టీకి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
సుస్మితా దేవ్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై అసోంలోని సిల్చార్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. తర్వాత ఆమెకు పార్టీ అధిష్టానం ఆల్‌ ఇండియా మహిళా కాంగ్రెస్‌ బాధ్యతలు సైతం అప్పగించింది. 
 
అస్సోం శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత సుస్మితా దేవ్ రాజీనామా చేస్తుండటంతో కాంగ్రెస్‌కు మరింత ఇబ్బందికరంగా మారింది. రాజీనామాకు ముందు ఆమె వాట్సాప్‌ గ్రూప్‌ల నుంచి వైదొలిగారు. 
 
ఇటీవల ట్విట్టర్‌ కాంగ్రెస్‌ నేతలకు చెందిన అకౌంట్లు లాక్‌ చేయగా.. ఇందులో సుస్మితాదేబ్‌ అకౌంట్‌ కూడా ఉన్నది. ఇదిలా ఉండగా.. ఆమె తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.