ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2023 (23:09 IST)

రాహుల్ గాంధీతో భేటీ అయిన తుమ్మల నాగేశ్వరరావు

rahulgandhi
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. తుమ్మల ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది. కేసీ వేణుగోపాల్ పిలుపు మేరకు ఢిల్లీ చేరుకుని రాహుల్ గాంధీని కలిశారు. పార్టీలో చేరిన తర్వాత యువనేతను కలవడం ఇదే తొలిసారి. రాహుల్ గాంధీ పార్టీలో చేరిన రోజుకి సమయం ఇవ్వలేకపోయారు. దీంతో పాలనాధికారి తుమ్మలను పిలిపించారు. 
 
దాదాపు అరగంట పాటు రాహుల్ గాంధీ, తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
 
కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు రాహుల్‌తో భేటీ కావడం ఇదే తొలిసారి. ఇదిలావుంటే, పాలేరు నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతోనే తుమ్మల కాంగ్రెస్‌లో చేరినట్లు ఆయన అనుచరులు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర నేతల నుంచి ఆ స్థానం కోసం పోటీ నెలకొంది. 
 
పాలేరు టికెట్ కోసం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పాలేరు సీటుపై పోటీపై చర్చించేందుకు తుమ్మల ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే రాహుల్‌తో భేటీ అనంతరం పాలేరు, ఖమ్మం, కొత్తగూడెంలలో ఏ స్థానంలోనైనా పోటీ చేసేందుకు సిద్ధమని చెప్పడం గమనార్హం.