మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (15:00 IST)

యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీపై దేశద్రోహం కేసు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీపై దేశ ద్రోహం కేసు నమోదైంది. యూపీ ప్రభుత్వంతో పాటు.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను యూపీ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. 
 
అజీజ్ ఖురేషి రాంపూర్ ఎమ్మెల్యే ఖాన్ భార్య తన్జీమ్ ఫాతిమాను కలిసేందుకు అజామ్‌ఖాన్ ఇంటికి వచ్చారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను రక్తం పీల్చే రాక్షసుడితో పోలుస్తూ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
ఈ వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్త  ఆకాష్ సక్సేనా రాంపూర్ జిల్లా సివిల్ లైన్ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
ఖురేషీపై ఐపీసీ 124ఎ (సెడిషన్), 153ఎ (మతం, జాతి ప్రాతిపదికన గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 153బి (జాతీయ సమైక్యతకు హాని కలిగించే అంశాలు) 505 (1) ( బి) (ప్రజల్లో భయం కలిగించే ఉద్ధేశం) వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.