సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 జూన్ 2017 (11:05 IST)

వచ్చే ఎన్నికల్లో బీజేపీదే విజయం.. యడ్డీని సీఎంగా చూడాలనుకుంటున్నా: గాలి జనార్ధన్ రెడ్డి

మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందుకు ఆయన రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడమే కారణం.. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నెరవేర్చేందుకు తాను సిద

మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందుకు ఆయన రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడమే కారణం.. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నెరవేర్చేందుకు తాను సిద్దంగా ఉన్నానని గాలి జనార్దన్ రెడ్డి తెలిపారు. 
 
ఇంకా వచ్చే ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా గెలుస్తుందని.. యడ్డీని మళ్లీ సీఎంగా చూడాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని పేర్కొన్నారు.
 
ఇదిలా ఉంటే, ఇంతకుముందు యడ్యూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన గాలి.. మైనింగ్ కేసులతో జైలు పాలైనప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మూడేళ్ల జైలు శిక్ష అనంతరం గతేడాది విడుదలయ్యారు. జైలు జీవితం అనంతరం తన పొలిటికల్ రీఎంట్రీ కోసం గాలి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గాలి రీ ఎంట్రీపై బీజేపీ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.