సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

బూస్టర్ డోస్ విరాం 9 నెలలు కాదు 6 నెలలు

Vaccine
కొవిడ్‌ టీకా రెండు, మూడు (బూస్టర్ డోసులు) డోసుల మధ్య విరామ సమయాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇంతవరకు రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాతే ముందుజాగ్రత్త డోసు తీసుకోవాలన్న నిబంధన ఉంది. అయితే, తాజాగా ఈ సమయాన్ని 6 నెలలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తగ్గించింది. 
 
ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో బుధవారం వివరాలను వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయడంతో పాటు, ఇమ్యునైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టాగీ) ఉప కమిటీ సిఫార్సుల మేరకు ఈ సవరణ చేసినట్లు తెలిపారు.