శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 సెప్టెంబరు 2024 (09:03 IST)

పండ్ల జ్యూస్‌లో మానవ మూత్రాన్ని కలిపి విక్రయించిన వ్యాపారి... ఎక్కడ?

juice
కొందరు ముస్లిం వ్యాపారుల చర్యలు ఉగ్రవాదుల చర్యలకు ఏమాత్రం తీసిపోనివిధంగా ఉంటున్నాయి. తాజాగా ఓ ముస్లిం వ్యాపారి ఒకరు.. పండ్ల జ్యూస్‌లో మానవ మూత్రం కలిపి విక్రయించాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో జరిగింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ వ్యాపారిని పట్టుకుని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు జ్యూస్ షాపు యజమాని, అతడి దగ్గర పనిచేస్తున్న 15 ఏళ్ల మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఘజియాబాద్‌లోని బోర్డర్ ప్రాంతమైన ఇందిరాపురిలో అమీర్ ఖాన్ అనే వ్యక్తి స్థానికంగా ఖుషీ జ్యూస్ పాయింట్‌ను నడుపుతున్నాడు. అయితే, గత కొన్నిరోజులుగా అతను విక్రయిస్తున్న జ్యూస్ రుచిలో తేడా ఉండడంతో స్థానికులు విచారణ చేపట్టగా ఘటన వెలుగులోకి వచ్చింది. అతడు జ్యూస్‌లో మానవ మూత్రం కలిపి కస్టమర్లకు విక్రయిస్తున్నట్టు తేలింది. 
 
దీంతో అక్కడివారు అమీర్ ఖాన్‌ను స్వయంగా పట్టుకుని శుక్రవారం చితకబాదారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రజల నుంచి అమీర్ ఖాన్‌ను రక్షించి అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు జ్యూస్ పాయింట్లో పనిచేసే మైనర్‌ను స్టేషన్‌కు తరలించారు. కాగా, ఖుషీ జ్యూస్ కార్నర్‌లో మూత్రం డబ్బా దొరికిందని పోలీసులు తెలిపారు. జ్యూస్, మానవమూత్రం నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు.
 
ఖుషీ జ్యూస్ కార్నర్ విక్రయదారులు జ్యూస్ మానవమూత్రాన్ని కలుపుతున్నారని బోర్డర్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసులకు సమాచారం అందిందని ఘజియాబాద్ ఏసీపీ అంకుర్ విహార్ తెలిపారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. "షాప్ నుండి ఒక లీటరు మానవ మూత్రం ఉన్న డబ్బా దొరికింది. విచారించినప్పుడు దుకాణదారులు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారు. పోలీసులు వెంటనే అమీర్‌ను, అతని మైనర్ సహచరుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశాం. దర్యాప్తు జరుగుతోంది" అని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.