శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (20:11 IST)

గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ?

gulam nabi azad
ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. నిజానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఈయన బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ, ఈ ప్రచారానికి ఫుల్‌స్టాఫ్ పెట్టారు. పైగా, బీజేపీలో చేరబోనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్టు ప్రకటించారు. 
 
కాగా, కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా 50 ఏళ్లకు పైగా గడిపిన ఆజాద్, తాను ఇప్పుడే కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టానని, నెహ్రూ, గాంధీ, కాంగ్రెస్ పార్టీపై ఇప్పటికీ ఆధారపడిన తన సిద్ధాంతాలు-తన నుండి మారలేదన్నారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి కోసం తమ పార్టీ కృషి చేస్తుందని వెల్లడించారు.