వాహనదారులకు గుడ్‌న్యూస్!
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా శుభవార్త చెప్పింది. డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్‌సీ) వంటి డాక్యుమెంట్ల వ్యాలిడిటీని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ
మేరకు రోడ్డు & రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
గత ఏడాది ఫిబ్రవరి 1 నాటికి ముగిసిన అన్ని వాహన పత్రాల గడువును కేంద్ర ప్రభుత్వం గతంలో 2021 జూన్ 30 వరకు పొడిగించింది. మళ్లీ ఇప్పుడు ఆ గడువును సెప్టెంబర్ 30, 2021 వరకు పొడిగించింది.
వాహనానికి చెందిన ఫిట్‌నెస్, పర్మిట్లు, లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతరత్రా డాక్యుమెంట్లు అన్నీ సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతాయి.
ఈ క్లిష్ట సమయంలో పౌరులు, రవాణాదారులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకరించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ కోరింది.