ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 ఆగస్టు 2018 (12:03 IST)

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక : ఎన్డీయే అభ్యర్థి గెలుపు

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేశారు. అలాగే, ప్రతిపక్షా

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేశారు. అలాగే, ప్రతిపక్షాల అభ్యర్ధిగా బీకే హరిప్రసాద్(కాంగ్రెస్‌) బరిలో దిగారు.
 
అయితే, గురువారం ఉదయం జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఎన్నిక సందర్భంగా మొత్తం 222 మంది సభ్యులు సభకు హాజరుకాగా, ఆప్, వైసీపీ సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. కాగా... ఎన్డీయే అభ్యర్ధి హరివంశ్ సింగ్‌కు 125 ఓట్లు వచ్చాయి. అలాగే వ్యతిరేకంగా 98 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్డీయే అభ్యర్థి గెలిచినట్టు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు.