1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2022 (16:37 IST)

గుజరాత్ ఎన్నికల ఫలితాలు: రవీంద్ర జడేజా భార్య గెలుపు

rivaba jadeja
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ మరోమారు విజయభేరీని మోగించింది. బీజేపీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఏమాత్రం గట్టిపోటీని ఇవ్వలేక పోయారు. ఫలితంగా 182 సీట్లకు గాను ఏకంగా 150కి పైగా సీట్లలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. వీరిలో క్రికెట్ రవీంధ్ర జడేజా భార్య రివాబా జడేజా కూడా ఉన్నారు. ఈమె తన సమీప ప్రత్యర్థిపై 50 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ నార్త్ నుంచి బరిలోకి దిగిన ఆమె బరిలోకి దిగారు. 
 
బీజేపీ చారిత్రాత్మక విజయం
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక విజయం దిశగా దూసుకెళుతోంది. గురువారం ఉదయం నుంచి వెల్లడవుతున్న ఫలితాల్లో ఆ పార్టీ ఘన విజయం సాదించింది. మొత్తం 182 అసెంబ్లీ సీట్లకుగాను బీజేపీకి చెందిన అభ్యర్థులు ఏకంగా 158 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
గత 2002లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 127 సీట్లను గెలుచుకుంది. ఇప్పటివరకు ఇదే అత్యధిక రికార్డుగా ఉంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆ రికార్డు చెరిగిపోయింది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో బీజేపీ 97 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఈ నెల 11 లేదా 12 తేదీల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. 
 
ఈ రెండు తేదీల్లో ఏదో ఒక రోజున గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పాటిల్ ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, ఈ నెల 15వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముందే గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు మెడుగా ఉన్నాయి.