శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 10 మే 2023 (11:50 IST)

జియో సర్వీసులు మాత్రమే ముద్దు.. : గుజరాత్ సర్కారు ఆదేశం

jioservice
గుజరాత్ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై కేవలం జియో సిమ్ సర్వీసులను మాత్రమే వినియోగించాలంటూ ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం వాడుతున్న వొడాఫోన్‌ - ఐడియా సర్వీసులను సోమవారం నుంచి నిలిపివేసినట్లు వెల్లడించింది. 
 
ఆ నంబర్లను రిలయన్స్‌ జియోకు మారుస్తున్నట్లు తెలిపింది. కేవలం రూ.37.50కే పోస్ట్‌పెయిడ్‌ సేవలను ఉద్యోగులకు అందించనున్నట్లు జియో సైతం ప్రకటించింది. గుజరాత్‌ ప్రభుత్వం, రిలయన్స్‌ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు, జియో సేవలతో ఉద్యోగులకు నెలకు 30 జీబీ డేటా 4జీ సర్వీసులతో లభిస్తుంది. 
 
గుజరాత్ సర్కారు జియోతో రెండేళ్ల కాలపరిమితితో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆరు నెలల తర్వాత జియో సేవలను ప్రభుత్వం సమీక్షిస్తుంది. ఈ సేవలు సంతృప్తికరంగా లేనిపక్షంలో ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తుంది. ఈ ఒప్పందంతో గత 12 సంవత్సరాలుగా అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు వొడాఫోన్ ఐడియా సేవలు అందిస్తూ వచ్చిన ఒప్పందం రద్దు అయింది. ఈ ఫోన్ నంబర్లను జియోకు పోర్ట్ చేసింది.