మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 మార్చి 2023 (17:41 IST)

కాన్పూర్‌లో విజృంభిస్తోన్న హెచ్‌3ఎన్‌2 వైరస్‌

fever
ఉత్తర్‌ప్రదేశ్‌‌లోని కాన్పూర్‌లో హెచ్‌3ఎన్‌2 వైరస్‌ విజృంభిస్తోంది. రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో ఐసీయూలు కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా కాన్పూర్ నగరంలోని హల్లెట్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తున్నారు. 
 
జ్వరం, నిరంతరాయంగా దగ్గు, ముక్కు కారడం, శ్వాసకోశ వంటి సమస్యలతో ఒక్క రోజులోనే 200 మంది ఆసుపత్రికి వచ్చారు. వీరిలో 50 మంది రోగులను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 
 
ప్రస్తుతం పెరుగుతున్న జ్వరం, దగ్గు కేసులకు "ఇన్‌ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్‌3ఎన్‌2" వైరస్‌ ప్రధాన కారణమని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) గుర్తించిన నేపథ్యంలో ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
 
ప్రతి ముగ్గురిలో ఒకరు జలుబు, దగ్గు, వైరల్‌ జ్వరాల బారిన పడటం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులు కాన్పూర్‌లో అధికంగా నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.