మంగళవారం, 16 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 మార్చి 2023 (16:58 IST)

పెళ్లి కొడుకు ఒక్కడే.. అయితే వధువులు ఇద్దరు... ఒకేసారి పెళ్లి

marriage
పెళ్లి కొడుకు ఒక్కడే అయితే వధువులు మాత్రం ఇద్దరు. పెళ్లి ముహూర్తం కూడా ఒక్కటే. ఒకేసారి ఇద్దరి వధువులకు తాళి కట్టి పెళ్లి చేసుకోనున్నాడు ఓ వ్యక్తి. ఈ పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు. పెళ్లి పత్రికలు కూడా సిద్ధమయ్యాయి. 
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. పెళ్లి కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలోని ఎర్రబోరు గ్రామానికి చెందిన మడివి ముత్తయ్య, రామలక్ష్మి దంపతుల కుమారుడు సత్తిబాబు ఒకేసారి ఇద్దరిని పెళ్లాడబోతున్నట్లు వెడ్డింగ్ కార్డులో కనిపిస్తుంది. 
 
కుర్నపల్లి గ్రామానికి చెందిన ఇర్ప సత్యనారాయణ, రుక్మిణి దంపుతుల కుమార్తె సునీతలను సత్తిబాబు పెళ్లాడనున్నట్లు ఆహ్వాన పత్రికలో ఉంది. ఒకే వ్యక్తి ఇద్దరిని ఒకే ముహూర్తంలో పెళ్లి చేసుకుంటుండటంతో ఇది వైరల్‌గా మారింది. 
 
వీరిద్దరినీ ప్రేమించిన సత్తిబాబు వారిని ఒకేసారి పెళ్లి చేసుకోనున్నాడు. బంధువులు, కుటుంబసభ్యులందరి సమక్షంలో గ్రాండ్‌గా  వీరి వివాహం జరుగనుంది.