గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (13:18 IST)

ఇకపై.. విమానాశ్రయాల్లో మూత్రం నిల్వ? ఐడియా ఇచ్చిన కేంద్ర మంత్రి

ఇకపై విమానాశ్రయాల్లో మూత్రం నిల్వ చేయనున్నారు. ఈ ఐడియా ఇచ్చింది సాక్షాత్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అయితే, ఆయన ఆలోచన వెనుక భారీ ప్రణాళికే ఉంది. అదేంటంటే.. మనుషుల మూత్రం నుంచి యూరియా తయారు చేయవచ్చన్నది ఆయన ఆలోచన. 
 
నాగపూర్‌లో జరిగిన మేయర్ ఇన్నోవేషన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ.. మూత్ర నుంచి యూరియా తయారు చేయాలని సూచించడం విశేషం. ఈ పని చేస్తే అసలు ఇండియా యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన అవసరమే రాదన్నారు. 
 
సహజ వ్యర్థాల నుంచి జీవ ఇంధనాలను ఎలా తయారు చేయొచ్చో గడ్కరీ వివరించారు. మనుషుల మూత్రంతోనూ జీవ ఇంధనం తయారు చేయవచ్చని చెప్పారు. మనిషి మూత్రంలో అమోనియం సల్ఫేట్, నైట్రోజన్‌లను వెలికి తీయొచ్చన్నారు. అందుకే ఎయిర్‌పోర్ట్‌లలో మూత్రాన్ని నిల్వ చేయమని సూచన చేసినట్టు చెప్పారు. 
 
మనం యూరియాను దిగుమతి చేసుకుంటాం. కానీ దేశంలోని అందరి మూత్రాన్ని మనం స్టోర్ చేసి పెడితే.. అసలు మనకు యూరియా దిగుమతి అవసరమే రాదు. అంతేకాదు ఏదీ వృథా కాదు అని గడర్కీ అన్నారు. నా ఆలోచనలన్నీ అత్యద్భుతంగా ఉంటాయి కాబట్టే.. ఎవరూ నాకు సహకరించరు అని ఆయన చెప్పడం విశేషం.