భర్తతో ఫోన్‌లో మాట్లాడుతూ పరలోకానికి!.. ఎలా?

lady dead
ఎం| Last Updated: శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (09:00 IST)
ఎక్కడో దేశం కాని దేశం థాయ్‌లాండ్‌లో ఉంటున్నాడు. భార్య ఇద్దరు పిల్లలతో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉంటోంది. భర్త ఫోన్ చేయడంతో మాట్లాడుతూ మంచంపైన కూర్చుంది. ఇంతలో అప్పటికే మంచం పైన ఉన్న రెండు పాములు ఆమెను కాటేశాయి.

రివాయ్ గ్రామానికి చెందిన జయసింగ్ థాయ్‌లాండ్‌లో ఉంటున్నాడు. అతడి భార్య గీత పిల్లలతో కలిసి గ్రామంలో ఉంటోంది. బుధవారం రాత్రి భర్త ఫోన్ చేయడంతో గీత మంచం మీద కూర్చుని మాట్లాడుతోంది. ఫోన్ మాట్లాడుతున్న క్రమంలోనే మంచంపై రెండు పాములు కనిపించాయి. వాటిని చూసి పాములు అని గట్టిగా అరిచే లోపే అవి కాటేశాయి.

దాంతో ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది. అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి చూసే లోపు ఆమె నోటి నుంచి నురగలు వస్తున్నాయి. వెంటనే వారు గీతను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో గీత ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయింది.దీనిపై మరింత చదవండి :