మంగళవారం, 27 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2019 (20:26 IST)

ఆకర్షణ సిద్ధాంతాన్ని ఐన్‌స్టీన్ కనిపెట్టారన్న గోయల్.. మంత్రులకు జీకే కూడా లేదా?

కేంద్రమంత్రి పియూష్ గోయల్ నవ్వుల పాలయ్యారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆటో రంగం పతనంపై చేసిన వ్యాఖ్యలను సమర్థించబోయి అభాసుపాలయ్యారు. ఆకర్షణ సిద్ధాన్ని ఐన్‌స్టీన్ కనిపెట్టారని చెప్పుకొచ్చారు. 
 
పైగా, ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్లు డాలర్లుగా ఉందనీ, ఇలాంటి ఘనత ఉంటేనే 12 శాతం వృద్ధిరేటు సాధ్యమన్నారు. అయితే, ఇలాంటి లెక్కలను వేసుకుని కూర్చొనివుంటే ఐన్‌స్టీన్ భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టేవాడు కాదంటూ వ్యాఖ్యానించి అభాసుపాలయ్యారు. 
 
ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైనశైలిలో రెచ్చిపోతున్నారు. కేంద్ర మంత్రులకు ఎకనామిక్స్ (ఆర్థిక శాస్త్రం) తెలియదనీ, కనీసం జనరల్ నాలెడ్జ్ కూడా లేదంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి వారు కేంద్ర మంత్రులుగా ఉండటం మన తలరాత అంటూ సెటైర్లు వేస్తున్నారు.