శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 11 జనవరి 2018 (10:40 IST)

సరదాగా కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు.. ఆపై హత్య కూడా..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. మద్యం తాగి, సినిమా చూశాక.. కామాంధులు బాలికను కిడ్నాప్ చేశారు. ఆపై అత్యాచారానికి పాల్పడి.. హత్య కూడా చేశారు. ఇదంతా సరదాగా చేశారని నింపాదిగా పోలీసుల విచారణలో

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. మద్యం తాగి, సినిమా చూశాక.. కామాంధులు బాలికను కిడ్నాప్ చేశారు. ఆపై అత్యాచారానికి పాల్పడి.. హత్య కూడా చేశారు. ఇదంతా సరదాగా చేశారని నింపాదిగా పోలీసుల విచారణలో చెప్పారు. వివరాల్లోకి వెళితే, మీరట్‌కు చెందిన అబ్బాసీ, దిల్షద్, ఇజ్రాయెల్‌ స్నేహితులు. వారం క్రితం వీరు ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆపై హత్యచేశారు. బాలిక మృతదేహాన్ని నోయిడాలోని ఓ కాలువలో పడేసి వెళ్లిపోయారు. బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. రాత్రి పూట మద్యం తాగుతూ సినిమా చూశామని.. ఆపై సరదాగా కారులో వెళ్తూ కిడ్నాప్ చేయాలనుకుని రోడ్డుపైకి వచ్చామని నిందితులు పోలీసుల విచారణలో చెప్పారు. 
 
ఆ సమయంలో బాలిక ఒంటరిగా వెళ్తూ కనిపించడంతో ఆమెను కారులో ఎక్కించుకుని.. సామూహికంగా అత్యాచారానికి పాల్పడి చంపేశామని నిందితులు తెలిపారు. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో వారిని రిమాండ్‌కు తరలించారు.